Monday, November 18, 2024

వడ్ల టెండర్ల వెనుక బియ్యం మాఫియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మా రిన ‘వడ్ల వార్’ జరగడానికి తెర వెనుక బియ్యం మా ఫియా కీలక పాత్ర వహించినట్లు తెలిసింది. మిల్లర్లను, ఇ టు పౌర సరఫరాల కార్పొరేషన్‌ను, అధికారులను, నేతల ను ఇంత కాలం డబ్బు మూటలతో శాసిస్తున్న బియ్యం మాఫియా కారణంగానే అధికార పక్షం, విపక్షం మధ్య ధాన్యం సేకరణపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇ చ్చిన మూడు నెలల గడువులోపు నాలుగు టెండర్ ఏజెన్సీ లు ధాన్యాన్ని ఎగవేసిన మిల్లర్ల నుంచి ధాన్యాన్ని గాని, నగదును గాని రాబట్టలేకపోయాయి. మొత్తం 35 లక్షల టన్నుల ధాన్యానికి కేవలం 2 లక్షల టన్నుల ధాన్యం వి లువ రూ. 500 కోట్లు మాత్రమే పౌర సరఫరాల శాఖ కు వచ్చాయి. ఏజెన్సీలకు ఇచ్చిన గడువు మే 23తో ముగిసిం ది. దీనితో ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి ఏజెన్సీల సె క్యూరిటీ డిపాజిట్ ఇఎండి రూ. 556 కోట్లను స్వాధీనం చేసుకోవచ్చు. కాని ఈ స్వాధీనం సొమ్ము కన్నా మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యం విలువ రూ. 6500 కోట్ల విలువ కావడంతో నిర్ణయం తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నది.

మరోవైపు రూ. 556 కోట్లు డిపాజిట్లు చెల్లించిన నాలుగు ఏజెన్సీలు కూడా అటు మిల్లర్ల నుంచి ధా న్యం లేదా నగదు సేకరించలేక, గడువు ప్రకారం ప్ర భుత్వానికి రీకవరీ అప్పజెప్పలేక సతమతమవుతున్నాయి. మొ త్తం ఈ టెండర్ వ్యవహారంలో బియ్యం మాఫియా అటు టెండర్ ఏజెన్సీలకు ఇటు ప్రభుత్వానికి మధ్య కుదిర్చిన ఒప్పందంలో వైఫల్యం కావడంతో ఈ మొత్తం దం దా నుం చి సురక్షితంగా బయటపడే విషయంలో గడిచిన మూడు రోజులుగా మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. టెండర్ ప్రకారం ఏజెన్సీలు మిల్లర్ల నుంచి ధాన్యం క్వింటాలుకు రూ. 2007 తీసుకుని కార్పొరేషన్‌కు జమ చే యాలి. కాని టెండర్  ఏజెన్సీలు క్వింటాలుకు రూ. 2007కు బదులు రూ. 2223 చెల్లించాలని మిల్లర్లను ఒత్తిడి తెస్తున్నాయి. కాని ధాన్యం ఎగవేసిన మిల్లర్లలో ఉద్దేశపూర్వకంగా ఉండే 10 శాతం డిఫాల్టర్లు మినహాయిస్తే మిగతా 90 శాతం మంది టెండర్ ప్రకారం రూ. 2007 చెల్లిస్తామని అదనంగా ఇవ్వలేమని జిల్లాల అధికారులకు లేఖలు కూడా ఇచ్చాయి. కాని అదనపు డబ్బు డిమాండ్ చేయడంతోనే సేకరణ ఆగిపోయి వివాదం ఏర్పడింది. అదనంగా చెల్లించాల్సిన రూ. 216 డబ్బు ఇవ్వలేమని మిల్లర్లు పట్టుబట్టడంతో మూడు నెలల గడువు కాస్తా ముగిసింది. ఈ అదనపు డబ్బు వెనుక బియ్యం మాఫియా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వానికి ఏజెన్సీలకు మధ్య అనధికారికంగా అదనపు రేటు ప్రకారం ఒప్పందం కుదిరేలా మాఫియా మధ్యవర్తిత్వ పాత్ర వహించింది. ఈ కారణంగానే విపక్షాలు కూడా అదనపు డబ్బుపై రూ. వెయ్యి కోట్ల దాకా కుంభకోణం జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.

మిల్లర్లు ధాన్యం ఇవ్వలేని పరిస్థితిలో అదనపు డబ్బు అయినా ఇస్తారని మాఫియా చెప్పి అటు ప్రభుత్వాన్ని, ఇటు ఏజెన్సీలను ఒప్పించాయి. కాని మొత్తం కథ అడ్డంతిరగడంతో ప్రభుత్వం, ఏజెన్సీలు అయోమయంలో చిక్కుకున్నాయి. మొత్తం ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగడంతో టెండర్ల వెనుక ఉన్న మాఫియా ఏజెన్సీ ప్రతినిధులతో, ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో వివాదాన్ని సుఖాంతం చేసే మంతనాలు తీవ్ర స్తాయిలో జరుపుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంకా బయటపడలేదు. కాని జిల్లాల నుంచి ‘మన తెలంగాణ’ ప్రతినిధులు మిల్లర్లతో మాట్లాడితే తాము తీసుకున్న ధాన్యానికి టెండర్లో నిర్ణయించిన రేటుకు డబ్బు చెల్లిస్తామని తమపై కేసులు, ఆస్తుల స్వాధీనాలు వద్దని చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రతినిధులు మిల్లర్ల మాఫియాపై ఆధారపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం బకాయి పడ్డ మిల్లర్లతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తే చెల్లింపులు జరిగే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. బియ్యం మాఫియా కారణంగానే అదనపు చెల్లింపులను ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయని దాన్ని తాము ఎలా అంగీకరిస్తామని వారు అంటున్నారు.

మిల్లర్ల అసోసియేషన్‌కు ఎన్నికలు జరగవా?
రాష్ట్రంలో ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య ధాన్యం సేకరణ విధానం సాఫీగా సాగడానికి నిజాయితీతో కూడిన రాష్ట్ర అసోసియేషన్ ఉండాలి. రాష్ట్రంలో 25000లకు పైగా మిల్లులున్న ఇప్పుడు రాష్ట్ర అసోసియేషన్‌గా చెప్పుకుంటున్న సంఘంలో ఎంత మంది సభ్యులకు సభ్యత్వం ఉందో లేదో తెలియదు. గడిచిన పదేళ్లుగా అసోసియేషన్ అధ్యక్ష పదవి అనేది ఒకరి గుప్పిట్లోనే చిక్కుకున్నది. సభ్యులు లేకుండా, ఎన్నికలు లేకుండా కొందరు నామమాత్రంగా చప్పట్లతో అసోసియేషన్‌ను ఎన్నుకొన్నట్లుగా లెటర్ ప్యాడ్ ముద్రించి దానితో మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాలు సక్రమంగా ఉంటే బాగుండేది. కాని సిఎంఆర్ బియ్యం కేటాయింపుల నుంచి లంచాల వసూళ్ళ దాకా అంతా అసోసియేషన్ ముసుగులోని కొందరు మాత్రమే లెక్కా పత్రం లేకుండా దందాను కొనసాగిస్తున్నారు. ఫలితంగా మొత్తం మిల్లింగ్ పరిశ్రమకు అవినీతి మచ్చ పడుతున్నది. అసోసియేషన్ అంటే ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి. సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలి. కాని ఇదేదీ జరక్కుండా రాష్ట్ర అసోసియేషన్ ఏర్పడడం ఆ ముసుగులో టెండర్లలో మాయాజాలం చేయడం, ధాన్యం సేకరణ అప్పగింతలో అక్రమాలు చేయడంలో ఈ ముఠా అందెవేసిన చేయిగా మారింది. అసలు అసోసియేషన్ ప్రమేయం ఏమీ లేకుండా పౌర సరఫరాల శాఖ స్వేచ్ఛగా పని చేసేలా ప్రభుత్వం ఆదేశిస్తే మొత్తం వేల కోట్ల లంచాల బండారం బయటపడుతుంది.

గత ప్రభుత్వ ఉదాసీనతతోనే మాఫియా విజృంభణ
సిఎంఆర్ ధాన్యం ఎగవేయడం ఎక్కువగా గడిచిన ప్రభుత్వంలోనే జరిగింది. బ్యాంకు గ్యారంటీలు లేకుండా సిఎంఆర్ ధాన్యాన్ని కెపాసిటీ లేని మిల్లర్లకు అప్పగించి వారి ఎగ్గొట్టేలా చేసి ఆ డబ్బును అందరికీ పంచి ఇవ్వడంలో బియ్యం మాఫియా విజయవంతమైన పాత్ర వహించింది. ప్రభుత్వం ఈ విషయంలో కఠినమైన పటిష్ట విధానాన్ని అవలంబించకపోవడం, మిల్లర్లలో ధాన్యాన్ని ఎగవేసిన వారు ఎక్కువ డబ్బును అధికారులకు, ప్రజాప్రతినిధులకు పంచడంతో మొత్తం ఎగవేత అనేది షరా మామూలుగా మారింది. దీనితో రైతుల నుంచి మద్దతు ధరకు ఐకెపిల ద్వారా అప్పు తెచ్చిన డబ్బుతో ధాన్యాన్ని కొన్న పౌర సరఫరాల శాఖ రూ. 65 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత మేరకు పౌర సరఫరాల శాఖకు స్వేచ్ఛ ఇవ్వడంతో డిఫాల్ట్ మిల్లర్లపై దాడులు చేసి కేసులు పెట్టడంతో రూ. 6500 కోట్ల దాకా రీకవరీ వచ్చింది. కాని బియ్యం మాఫియా వెనుక ఉండి టెండర్ల మాయాజాలంతో అదనపు డబ్బు వసూలు చేయాలని నిర్ణయించడంతోనే ప్రభుత్వం ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News