Monday, November 18, 2024

విత్తన విక్రయాలపై నజర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రలో ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి అవసరమైన విత్తనాల పంపిణీ ఏర్పాట్లపై గురువారం నాడు అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రస్థాయి అధికారులతో ప్రత్తి విత్తనాల సరఫరా , లభ్యతపై సమీక్షించారు. ఈ సందర్భముగా జిల్లాల వారీగా నేటికి 68,16,967 వివిధ కంపెనీల ప్రత్తివిత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి తెలుపగా, మి గతా ప్యాకెట్లు కూడా జూన్ 5 కల్లా జిల్లాలకు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఇప్పటికే అన్ని జిల్లాలలో అవసరమేరకు ప్రత్తి, జిలుగ విత్తనాలు పంపిణీ చేసినందున, జిల్లా కలెక్టర్లు అవి రైతులకు సక్రమంగా చేరేవిధంగా అన్ని చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఎక్కడైనా రైతులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లైతే, కౌంటరులు ఎక్కువ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇకనుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు ప్రతినిత్యం పర్యటిస్తూ ప్రతివిత్తనాల విక్రయకేంద్రాలను, జిలుగ, జనుము సరఫరా చేసే కేంద్రాలకు పర్యటిస్తూ, రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.

విత్తన కంపెనీ ప్రతినిధులను అందరినీ పిలిపించి వారితో మంత్రి కంపెనీ వారిగా సమీక్షించారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకొని, సిద్ధంగా ఉన్నారని, అందుకని విత్తన కంపెనీలు అందరూ వారిచ్చిన ప్రణాళిక ప్రకారం మిగతా ప్రత్తి విత్తన ప్యాకేట్లను కూడా జూన్ 5 కల్లా జిల్లాలకు చేరవేర్చాల్సిందిగా ఆదేశించారు అదేవిధంగా కొన్ని జిల్లాలలో, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీయొక్క ఒక రకమైన విత్తనాలనే రైతులందరూ కొరుతున్నారని, యూనివర్సిటి పరిశోధనల ప్రకారం మార్కెట్లో లభ్యమవుతున్న ప్రతి విత్తన హైబ్రిడ్ల దిగుబడి ఒక్కటేనని, ఈ విషయాన్ని రైతులందరికి తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత అందరిదని తెలియచేశారు. ప్రతిరోజు జిల్లావారి, కంపెనీవారిగా ప్రత్తివిత్తన ప్యాకెట్ల పంపిణీ మరియు కొనుగోలు వివరాలు తెప్పించుకోవడం జరుగుతుందని, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రత్తి మరియు పచ్చిరొట్ట విత్తనాలు అవసరం మేరకు ఉన్నాయని కావునా రైతులెవరూ తొందరపడకుండా వారి వారి అవసరం మేరకు విత్తనాలను ప్రభుత్వ ఆమోదిత దుకాణాల నుండి కొనగలరని, ప్రతి కొనుగోలుకు సంబంధించి బిల్లులను తీసుకొని భద్రపరుచుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News