Monday, December 23, 2024

పోర్న్ స్టార్ కు చెల్లింపులు…ట్రంప్ ను దోషిగా తేల్చిన కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: పోర్న్ స్టార్ కు అక్రమ చెల్లింపులు(హుష్ మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో క్రిమినల్ కేసులో దోషిగా  అమెరికా ప్రెసిడెంట్ పదవి చేపట్టిన వ్యక్తి రికార్డులోకెక్కారు.

అక్రమ సంబంధం గురించి నోరెత్త కుండా ఉండేందుకు ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు చెల్లింపులు చేశారు. అందుకు తప్పుడు డాక్యుమెంట్లు కూడా ట్రంప్ సృష్టించాడు. ఈ కేసులో ట్రంప్ పై పెట్టిన మొత్తం 34 అభియోగాలు రుజువయ్యాయని కోర్టు జ్యూరీ ప్రకటించింది. జులై 11న తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్ కు శిక్ష ఖరారయ్యే అవకాశాలున్నాయి. గరిష్ఠంగా నాలుగేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది.

2006లో తనను లైంగికంగా వాడుకున్న డొనాల్డ్ ట్రంప్ విషయం బయటపెట్టకుండా ఉంచేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ‘హుష్ మనీ’ కేసును ఫైల్ చేశారు. ఈ కేసులో మన్ హటన్ కోర్టు 22 మంది సాక్షులను విచారించింది. ఇదిలావుండగా ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్  పోటీచేస్తున్నారు. ఒకవేళ ట్రంప్ కు శిక్ష పడినా ఆయన పై కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News