Friday, October 18, 2024

రేపే లోక్ సభ తుది దశ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

బరిలో ఉన్న 904 మంది అభ్యర్థులలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: లోక్ సభ తుది దశ ఎన్నికలు రేపు(శనివారం) జరుగనున్నాయి. దాదాపు 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు.

కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాలలో 57 స్థానాలకు ఈ ఏడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ మూడో సారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.

పంజాబ్ లోని మొత్తం 13 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు స్థానాలకు, ఉత్తర్ ప్రదేశ్ లోని 13 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్ లోని తొమ్మిది స్థానాలకు, బీహార్ లోని ఎనిమిది స్థానాలకు, ఒడిశాలోని ఆరు స్థానాలకు, ఝార్ఖండ్ లోని మూడు సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఈసారి పోటీలో ఉన్న ప్రముఖులలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, లాలూ ప్రసాద్ కూతురు మిసా భారతి , నటి కంగనా రనౌత్ ఉన్నారు. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనున్నది.

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం టెలివిజన్ ఛానల్స్, వార్తా సంస్థలు జూన్ 1న సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్ డేటాను ప్రదర్శించుకోవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News