Saturday, November 16, 2024

రేవంత్ చెప్పినట్టు వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన ఆ బలి దేవత ఎవరు?:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది, అమరవీరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిలదీశారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపైన, గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన ఘటనలపైన కెటిఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరు మందిని బలిగొన్నది, 1969 -71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు..? అని అడిగారు.

1971 పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లలో 11 స్థానాల్లో తెలంగాణ ప్రజా సమితి పార్టీని గెలిపిస్తే, ఆ పార్టీని మాయం చేసింది ఎవరని, దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరి వల్ల అని కెటిఆర్ ప్రశ్నించారు. 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు..? అని పేర్కొన్నారు. వీటన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే సమాధానంగా ఆయన పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలి దేవత ఎవరు..? అని ప్రశ్నించారు. ఆ సమాధానాన్ని మాత్రం ఖాళీగా వదిలారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News