Sunday, November 24, 2024

నాగ్‌పూర్‌లో ఉష్ణోగ్రత 56 డిగ్రీలు చేరలేదు

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్‌లోని వాతావరణ కేంద్రం గురువారం 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చేసిందన్న వార్తల నేపథ్యంలో ఉష్ణోగ్రత సెన్సార్లు సరిగ్గా పని చేయని కారణంగా ఆ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ సిబ్బంది స్పష్టం చేశారు. నాగ్‌పూర్‌లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఎడబ్లుఎస్) తీరుపై ఇప్పుడు పరిశీలన జరగనున్నది. వార్తల ప్రకారం, నాగ్‌పూర్ రామ్‌దాస్‌పేఠ్‌లోని పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాలయ్ (పిడికెవి)కి చెందిన 24 హెక్టార్ల ఓపెన్ వ్యవసాయ క్షేతం 56 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసింది. అయితే, న్యూఢిల్లీ కేంద్రంగా గల భారత వాతావరణ శాఖ (ఐఎండి), నాగ్‌పూర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎంసి) శుక్రవారం ఒక వివరణ వెలువరించాయి.

‘నాగ్‌పూర్ నగర ఎడబ్లుఎస్‌లోని ఉష్ణోగ్రత సెన్సర్ ప్రస్తుతం సరిగ్గా పని చేయడం లేదు. నాగ్‌పూర్ ఆర్‌ఎంసి దానిని సరి చేసే పనిలో ఉంది. అయితే, తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ సెన్సర్లు విఫలం కావచ్చునని గుర్తించడం ముఖ్యం. గురువారం నాటి 56 డిగ్రీల ఉష్ణోగ్రత వార్త సరైనది కాదు. అధికారికంగా ప్రకటించినది కాదు’ అని నాగ్‌పూర్ ఆర్‌ఎంసి వివరించింది. అయితే, సమీపంలో కేంద్ర పత్తి పరిశోధన సంస్థ (సిఐసిఆర్)లో పని చేస్తున్న ఎడబ్లుఎస్ నమోదు చేసిన గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలని నాగ్‌పూర్ ఆర్‌ఎంసి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News