మేషం – అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వృషభం – రాబడి పెరుగుతుంది. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులను కలిసి విహారయాత్రలు చేస్తారు.
మిథునం – దైవ చింతన కలిగి ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం – ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.
సింహం – ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, నూతన ఒప్పందాలు లాభిస్తాయి. తనఖా వస్తువులను విడిపిస్తారు.
కన్య – వ్యాపార సంబంధిత కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సానుకూల పడతాయి. మంచి మాటకారిగా వ్యవహరిస్తారు. లిటిగేషన్ వ్యవహారాలు సానుకూల పడతాయి.
తుల – రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు. సాధ్యమైనంత వరకు వత్తిడికి లోను కాకుండా ఉండటానికి యోగా వంటివి అభ్యసిస్తారు.
వృశ్చికం – రుణాలను కొంతవరకు తీరుస్తారు – ఉద్యోగాలపరంగా సంతృప్తికరమైన ఫలితాలు వృత్తి పొందుతారు. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి.
ధనున్సు – వృత్తి వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు.
మకరం – ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్షిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.
కుంభం – ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో మెలగడం చెప్పదగినది. చికాకు అసహనం అధికంగా ఉంటాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు.
మీనం – రుణాలు తీరుస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి