Saturday, September 28, 2024

చివరి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: చివరి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చివరి విడతలో ఎనిమిది రాష్ట్రాల్లో 57 లోక్ సభ స్థానాలతో ఒడిశా రాష్ట్రంలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్ర ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్ 13, పంజాబ్ 13, పశ్చిమ బెంగాల్ 9, బిహార్ 8, ఒడిశా6, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్3 , ఛండీగఢ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. తుది విడత ఎన్నికల బరిలో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఏడో విడతలో పంజాబ్‌లో అత్యధికంగా 328 మంది అభ్యర్థులు బరిలో ఉండగా యుపి 144, బిహార్ 134, ఒడిశా బరిలో 66 మంది అభ్యర్థులు ఉన్నారు. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బరిలో ఉన్నారు. వారణాసిలో పిఎం మోడీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. మండి నుంచి కాంగ్రెస్ తరపున విక్రమాదిత్య సింగ్ బరిలో ఉన్నారు. హమీర్ పూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడుతాయి. జూన్ 2న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News