Friday, November 22, 2024

సవాల్ వంటిదే : రోహిత్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: టి20 వరల్డ్‌కప్ తమకు సవాల్ వంటిదేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నా డు. ఈ మెగా టోర్నమెంట్‌లో విజేతగా నిలవడం అనుకున్నంత తేలికేం కాదన్నాడు. టోర్నీలో పలు అగ్రశ్రేణి జట్లు పడుతున్న నేపథ్యంలో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమన్నాడు. ఇక తాము చా లా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నామన్నాడు. ఇలాంటి స్థితిలో నేరుగా వరల్డ్‌కప్ వంటి పెద్ద టోర్నీలో దిగడం కాస్త ఇబ్బందికర పరిణామమేనన్నాడు. ఇక తాము శనివారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు ఇక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంటుందన్నాడు.

దీంతో బంగ్లాతో జరిగే వార్మప్ పోరు తమకు చాలా కీలకంగా మారిందన్నాడు. బ్యాటర్లు, బౌలర్లు తమ లయను అందిపుచ్చుకోవడానికి ఈ మ్యాచ్ మంచి వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ప్రస్తుతం తమ జట్టు సమతూకంగా ఉందనన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు. ప్రతి ఆటగాడిలో అపార నైపుణ్యం దాగివుందన్నాడు. దీంతో ఈ మెగా టోర్నీలో తాము భారీ ఆశలతో బరిలోకి దిగుతున్నట్టు రోహిత్ వివరించాడు. వరల్డ్‌కప్ నేపథ్యంలో ఐసిసికి ఇచ్చిన ఇం టర్వూలో రోహిత్ పలు విషయాలు వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News