Friday, November 22, 2024

కన్యాకుమారిలో ముగిసిన మోడీ సుదీర్ఘ ధ్యానం

- Advertisement -
- Advertisement -

తమిళనాడు లోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేపట్టిన సుదీర్ఘధ్యానం ముగిసింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ధ్యానం , 45 గంటల పాటు కొనసాగింది. ఈ క్రమం లోనే శనివారం ఉదయం సూర్యుడికి ఆర్ఘం వదిలారు. ధ్యానం ముగిసిన అనంతరం ప్రముఖ తమిళ కవి , తత్వవేత్త తిరువళ్లువర్ విగ్రహానికి మోడీ పూలమాల వేసి నివాళులర్పించారు. వివేకానంద శిలాస్మారకం పక్కనే చిన్న దీవిపై ఏర్పాటు చేసిన 133 అడుగుల ఎత్తయిన ఈ భారీ విగ్రహం వద్దకు ఆయన పడవలో చేరుకున్నారు.

అనంతరం కన్యాకుమారి తీరానికి తిరిగి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోడీ తమిళనాడు లోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం శిలా స్మారకాన్ని చేరుకుని, ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు. 2019లో ఎన్నికల సమయంలో మోడీ కేదార్‌నాథ్ వద్ద గుహలో ధ్యానం చేసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News