Saturday, November 9, 2024

కెసిఆర్ ప్రభుత్వంలోనే అన్ని స్కీంలు, స్కాంలే: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదనీ, ఆ విషయాన్ని కెసిఆర్ నిండు సభలో చెప్పారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కెసిఆర్ ప్రభుత్వంలోనే అన్ని స్కీంలు, స్కాంలు జరిగాయని గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందని ఆయన తెలిపారు. శనివారం తన జన్మదినం సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాలను గెలుస్తామన్నారు. కాంగ్రెస్ వేవ్ ఉందని తమ అభ్యర్థులు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పదేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బిఆర్‌ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీ లోపు 2లక్షల రుణ మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రీయ గీతంపై కెటిఆర్ మతి భ్రమించి ఆందోళనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చిహ్నంపై అందరితో చర్చించి నిర్ణయం ఉంటుందన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ రావులే…
ఫోన్ ట్యాపింగ్‌లో అందరూ రావులే ఉన్నారని ఆయన ఆరోపించారు. ఆవిర్భావం వేడుకలకు కెసిఆర్‌ను ఆహ్వానించామని, వస్తారా లేదా అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తామన్నారు. జూన్‌లో అన్ని జిల్లాల్లో మంత్రులు పర్యటిస్తారని అభివృద్ధిపై సమీక్షలు ఉంటాయన్నారు. బిఆర్‌ఎస్ ఒక్క ఎంపి సీటు గెలవదని ఫలితాల తర్వాత ఆ పార్టీ ఉండదన్నారు. బిజెపి జూటా పార్టీ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. మోడీ ప్రధానిగా చేసిన అభివృద్ధిని చెప్పకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేశారని ఆయన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో పోలీ సులు తమ పని తాము చేసుకుంటున్నారని ఎంత మంది లోపలికి వెళ్తారు అన్నది త్వరలో తెలుస్తుందన్నారు. ఎపి ప్రజల నాడి తమకు అంతు బట్టడం లేదని, ఫలితాలపై ఉత్కంఠగా ఉందన్నారు. ఎపి ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? లేక వైసిపికి పట్టం కడతారన్న విషయంలో ఉత్కంఠ నెలకొందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిల మధ్య హోరా హోరీ పోరు జరిగిందన్నారు. బిఆర్‌ఎస్ రాష్ట్రంలో తుడుచు పెట్టుకుపోయిందన్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కచ్చితంగా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మొదట్లో బిజెపి హావా కొనసాగినా అటు తరువాత ఉత్తరాదిన కాంగ్రెస్, ఇండియా కూటమి బాగా పుంజుకుందన్నారు. దీంతో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడం కష్టం అయ్యిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News