Monday, December 23, 2024

బ్యాంక్ ఆఫ్ ఇండియా 666 రోజుల ఎఫ్‌డి పథకం

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ) శనివారం నుంచి డిపాజిట్లపై ఆకర్షణీయమైన రాబడి అందించే ‘666 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి)’ని ప్రారంభించింది. కస్టమర్లు, సాధారణ ప్రజలు 666 రోజుల ఎఫ్‌డి తెరవడం ద్వారా ఈ ప్రత్యేక పెట్టుబడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సూపర్ సీనియర్ సిటిజెన్‌ల కోసం సాలుకు 7.95 శాతం, సీనియర్ సిటిజెన్ కోసం సాలుకు 7.80 శాతం, ఇతరుల కోసం సాలుకు 7.30 శాతం మేర 666 రోజుల పాటు ( రూ. 2 కోట్ల కంటె తక్కువ డిపాజిట్ మొత్తానికి),

సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్‌ఆర్‌ఒ, ఎన్‌ఆర్‌ఇ రూపాయి టెర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఈ పథకం అత్యధిక రాబడి అందిస్తుంది. ఉన్నతమైన ఆర్థిక ఉత్పత్తులు అందించాలన బ్యాంక్ నిబద్ధతను బలోపేతం చేస్తుంది. ఈ 666 రోజులుఎఫ్‌డి’లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై లోన్, ముందస్తు విత్‌డ్రా సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ఏదైనా బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సందర్శించవచ్చు. లేదా బిఒఐ ఓమ్ని నియో యాప్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా 666 రోజుల ఎఫ్‌డి తెరవడానికి ఉపయోగించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News