Saturday, October 5, 2024

క్యూఆర్ కోడ్‌తో సంస్థనే ముంచిన నిందితులు

- Advertisement -
- Advertisement -

పనిచేస్తున్న సంస్థకు ఇద్దరు వ్యక్తులు కన్నమేశారు. సంస్థకు రావాల్సిన డబ్బులను తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చే విధంగా చేసి సంస్థ డబ్బులు రూ. 4.15కోట్లు మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం…చెంగిచెర్లకు చెందిన యసిరెడ్డి అనిల్ కుమార్, సికింద్రాబాద్‌కు చెందిన మందల రాజ్‌కుమార్ ఇస్తారా పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఫ్లోర్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. ఇస్తారా కంపెనీ హెడ్‌క్వార్టర్స్ కొండాపూర్‌లో ఉంది. సంస్థ దేశవ్యాప్తంగా కో లివింగ్ ప్రాపర్టీని హైదరాబాద్‌లో, దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఫుడ్ కోర్టులు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్‌లు సంస్థలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న సంస్థ ఫుడ్ కోర్టుల్లో అనిల్ కుమార్ ఇస్తారాకు బదులుగా ఇస్తా అనే తన కంపెనీ పేరుతో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడంతో తన బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి.

తాను రూ.2కోట్లు వచ్చినుట్లు చెప్పాడు. వచ్చిన డబ్బులతో రూ.40లక్షలతో ప్లాట్ కొనుగోలు చేశాడు. రూ.70లక్షలు తను చేస్తున్న మోసానికి సహకరించిన వారికి ఇచ్చాడు. రూ.60లక్షలు చిట్టీ కట్టాడు, మిగతా వాటిని అప్పులు కట్టాడు. తనతో పనిచేస్తున్న రాజ్‌కుమార్‌కు రూ.10లక్షలు ఇచ్చాడు. సంస్థకు సంబంధించిన ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీధర్‌కుమార్ దర్యాప్తు చేశారు. తమ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను పెట్టడంతో గత కొంత కాలం నుంచి డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఇద్దరు నిందితులు ఇలా రూ.4,15,00,000 జమ చేసుకున్నారు. వీటిని నిందితులు అప్పులు తీర్చడం, ఆస్తులు కొనుగోలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News