Tuesday, January 21, 2025

వెబ్‌సైట్‌లో గ్రూప్ 1 హాల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. శనివారం హాల్ టికెట్లను టిజిపిఎస్‌సి అధికారిక వెబ్‌సైట్‌లో కమిషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని టిజిపిఎస్‌సి సూచించింది. ఈ నెల 9న ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనున్నది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

గ్రూప్- 1 ప్రిలిమ్స్ కోసం దాదాపు 4.03 లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10.30 గంటలకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభం కానుండగా, అభ్యర్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు టిజిపిఎస్‌సి తెలిపింది. పరీక్షా సమయానికి అరగంట ముందు అంటే ఉదయం 10 గంటలకు గేట్లు మూసివేయనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News