Friday, December 20, 2024

ఎగ్జిట్ పోల్స్ ఓ కార్పొరేట్ గేమ్: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ముంబై: శివసేన(యూబిటి) నేత సంజయ్ రౌత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఓ ‘కార్పొరేట్ గేమ్’ అన్నారు. ఎవరెక్కువ డబ్బులిస్తే వారికి అనుకూలంగా గణాంకాలను విడుదల చేస్తారన్నారు. అధికారంలో ఉండి, డబ్బుంటే ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్వంత అంచనాల లెక్కలు విడుల చేసుకోవచ్చన్నారు. ఇండియా బ్లాక్ 295 నుంచి 310 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.

మంత్రి అమిత్ షా 150 మంది కలెక్టర్లను పిలిచి హెచ్చరించారని అన్నారు. హెచ్చరికలు, బెదిరింపులతో ఎవరూ ఎన్నికల్లో గెలవలేరని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా ఎగ్జిట్ పోల్స్ తప్పు తోవ పట్టిస్తున్నాయని రౌత్ అభిప్రాయపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News