- Advertisement -
చిత్తూరు: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపిలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నట్లు పేర్కొంది.
ఇదివరలో జూన్ 4,5 తేదీల్లో రుతుపవనాలు ఏపిలోకి ప్రవేశిస్తాయని అంచనా వేసినప్పటికీ రెండు రోజులు ముందుగానే ఏపి తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఇది ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి ఊతం ఇవ్వగలదని…రైతులకు గుడ్ న్యూస్ అని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
- Advertisement -