- Advertisement -
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2తేదీని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. పదేళ్ల క్రితం, డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో లక్షలాది మంది ఆకాంక్షలను తీర్చిదిద్దుతూ భారతదేశంలోనే 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి ఇదే నా నివాళులు. అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత – ప్రజా తెలంగాణ దార్శనికతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ తెలిపారు.
- Advertisement -