Tuesday, January 7, 2025

రామ్ చరణ్ కూతురికి ‘కల్కి’ టీమ్ గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లింకారకు కల్కి మేకర్స్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం కల్కి. ఇటీవల ఈ సినిమాలోని బుజ్జి స్పెషల్ వాహనాన్ని పరిచయం చేశారు. ఈ బుజ్జి వాహనాన్ని పలువురు సెలబ్రెటీస్ కూడా డ్రైవ్ చేశారు. బుజ్జు అండ్ భైరవ పేరుతో యానిమేషన్ టీజర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది, చిన్న పిల్లలను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు మేకర్స్. వాటిని సెలబ్రిటీ పిల్లలకూ గిఫ్టులుగా పంపిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ కూతురు క్లీంకారకు కూడా ఈ బహుమతులు పింపించారు. దీంతో ‘థ్యాంక్స్ కల్కి టీమ్. ఆల్ ది బెస్ట్’ అంటూ బుజ్జి బొమ్మతో క్లీంకార ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టా షేర్ చేశారు. కాగా కల్కి మూవీపై అభిమానులతోపాటు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News