- Advertisement -
హైదరాబాద్: రేపే (మంగళవారం) పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుంది కనుక అభ్యర్థులంతా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, మంత్రులు, ఏఐసిసి సెక్రటరీలను కోరారు. ప్రతి నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారినే ఏజెంట్లుగా పంపాలని కూడా అన్నారు.
ప్రతీ కౌంటింగ్ రౌండ్ లోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 17 సి జాబితా ఉండేలా చూసుకోవాలన్నారు. 17 సి లిస్ట్ కు ఓట్లకు తేడా వస్తే అప్పటికప్పుడు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అందరూ అవగాహనతో వ్యవహరించాలన్నారు. ఈ జూమ్ సమావేశంలో దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఏఐసిసి సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
- Advertisement -