Saturday, December 21, 2024

కానిస్టేబుల్‌ను నరికి చంపారు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఓ కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపిన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సోడి లక్ష్మణ్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. గాదిరాస్ గ్రామంలో జాతర జరుగుతుండగా చూసేందుకు అక్కడికి లక్ష్మణ్ వేళాడు. అక్కడ అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకునే సరికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘాతూకానికి మావోయిస్టులు పాల్పడ్డారా? లేక సదరు కానిస్టేబుల్‌కు వ్యక్తిగత శత్రువులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News