లిస్బన్ : దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో రెండు విమానాలు ఢీకొని ఓ పైలట్ మృతి చెందగా, మరోపైలట్ తీవ్రంగా గాయపడ్డారు. బెజాలో ఆదివారం జరుగుతున్న ఎయిర్‌షోలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు ప్రదర్శిస్తుండగా, ఒకటి వేగంగా పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు విమానాలు కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు ఆవల పడగా, మరొకటి సమీపంలో కుప్ప కూలింది. దర్యాప్తు చేసి ప్రమాదానికి కారణాలేమిటో గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణ మంత్రి మనో మెలో తెలిపారు. పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన యాక్ స్టార్స్ అనే ఏరోబాటిక్ గ్రూప్ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్ 52 రకానికి చెందినవి. మరణించిన పైలట్ స్పెయిన్‌కు చెందిన వ్యక్తి కాగా, గాయపడిన పైలట్ పోర్చుగల్ పౌరుడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఓ వీక్షకుడు తన కెమెరాలో బంధించి ఎక్స్‌లో పోస్ట్ చేయగా, అది వైరల్ అవుతోంది.
గాలిలో విమానాలు ఢీకొని పైలట్ మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -