Thursday, January 9, 2025

విమానంలో యువకుని హల్‌చల్… అత్యవసర ల్యాండింగ్ తరువాత అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ముంబై : కేరళ లోని కొజికోడ్ నుంచి బహ్రెయిన్‌కు బయలుదేరిన విమానంలో వెనక ద్వారం తెరవడానికి ఓ ప్రయాణికుడు ప్రయత్నించి నానా రభస చేశాడు. దీంతో ముంబైలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేసి ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. అధికారులు సోమవారం ఈ సంఘటన గురించి వివరించారు. నిందితుడు 25 ఏళ్ల అబ్దుల్ ముసావిర్ నాడుకండీ కేరళకు చెందిన వాడు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కొజికోడ్ నుంచి టేకాఫ్ కాగానే నిందితుడు లేచి విమానం వెనక్కి వెళ్లి అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన సిబ్బందిని తోటి ప్రయాణికులను దూషించి దౌర్జన్యం చేయబోయాడు. సిబ్బంది ఎలాగోలా నచ్చచెప్పి అతడ్ని తిరిగి తన సీటులో కూర్చోబెట్టారు. సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలనకు గురయ్యారు. దాంతో విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా దింపివేశారు. అనంతరం అతడిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News