- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పెడ్లర్లను సమూలంగా నిర్మించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. టాస్క్ ఫోర్స్, పోలీసు సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
వాహనాలను ఆపి మరీ తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కూకట్ పల్లి పరిధిలోని వడ్డేపల్లి ఎన్ క్లేవ్ లో డ్రగ్స్ అక్రమ రవాణాదారులను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స
తీసుకొచ్చి సొమ్ముచేసుకుంటున్న షేక్ ఫరూఖ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 4.1 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
- Advertisement -