మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ దంపతుల కుమార్తె లిపి (27) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. చదువుల కారణంగా ఒత్తిడికి లోనవుతున్న ఆమె అపార్ట్‌మెంట్ పదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దక్షిణ ముంబై లోని రాష్ట్ర సచివాలయానికి సమీపంలో గల సురుచి అపార్ట్‌మెంట్‌లో తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. లిసి హర్యానా లో ఎల్‌ఎల్‌బీ కోర్సు చదువుతున్నారు.
ఆమె తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వ హయ్యర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. తల్లి రాధిక రస్తోగీ కూడా సీనియర్ ఐఎఎస్ అధికారిణి. లిపి తన చదువు గురించి ఆందోళనలో ఉండేదని పోలీస్‌లు తెలిపారు. చివరకు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఆమె సూసైడ్ నోట్ పోలీస్‌లకు లభించింది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని ఆమె సూసైడ్ నోట్‌లో రాసారు.