Friday, January 3, 2025

నన్ను జైలుకు పంపితే హింసాత్మక సంఘటనలే

- Advertisement -
- Advertisement -

తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా సంకేతమిచ్చారు. తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేక పోవచ్చని అన్నారు. తనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోడానికి ప్రయత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్‌కు కోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. శృంగార తార స్టార్మీ డానియల్స్‌కు డబ్బు చెల్లింపు , దాని కోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం 34 అభియోగాల్లో ట్రంప్‌ను దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖరారు చేయనుంది. ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రకెక్కారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News