Saturday, January 18, 2025

మండిలో కంగనా రనౌత్ విజయం

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయ అరంగేట్రంలోనే జయ కేతనం ఎగురవేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో బిజెపి తరఫున పోటీ చేసిన కంగన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 72008 వోట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ఏడవ దశలో భాగంగా మండిలో ఈ నెల 1న పోలింగ్ జరిగింది. కంగన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘మేము ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ పేరుపై పోరాడాం. ఆయన విశ్వసనీయత, హామీ, ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసం ఫలితంగానే మేము మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం’ అని చెప్పారు. మరొక వైపు హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి అనురాగ్ ఠాకూర్ కూడా విజయం సాధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News