Saturday, January 18, 2025

నైతిక బాధ్యతతో ప్రధాని మోడీ రాజీనామా చేయాలి : జైరామ్ రమేష్

- Advertisement -
- Advertisement -

ఇండియా కూటమి 200 స్థానాలు కన్నా ఎక్కువ సాధించే దిశలో ఉండడం ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేయాలనే సంకేతాన్ని సూచిస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఎక్స్ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. బీజేపీ ఎక్కువ స్థానాలు కోల్పోవడంతో ప్రధాని మోడీ తప్పనిసరిగా నైతిక బాధ్యత తీసుకుని తన అగ్రస్థానాన్ని వదులుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నేతృత్వం లోని ఎన్‌డిఎ కూటమి మెజార్టీ స్థానాలు గెలిచి, మోడీ మళ్లీ ప్రధాని అవుతారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం మీద నరేంద్రమోడీ మూడోసారి ప్రధాని అవుతారని  ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో ప్రధాని మోడీ వరుసగా ఎక్స్ పోస్ట్‌ల్లో ప్రజలు తిరిగి ఎన్‌డిఎనే ఎన్నుకుంటారని, ఇండియా కూటమి అవకాశవాది అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News