Thursday, December 19, 2024

బుధవారం రాశి ఫలాలు(05-06-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన సొమ్ము చాలా వరకు చేతికంది వస్తుంది.  చెల్లింపులను కూడా మీరు సకాలంలో చెల్లిస్తారు.

వృషభం – ఆర్థిక లావాదేవీలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరును సంపాదిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం –  దీర్ఘకాలికంగా ఉన్న బాధలు తీరి ఊరట చెందుతారు. క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకొని తధానుగుణంగా అడుగులను ముందుకు వేస్తారు.

కర్కాటకం – వాయిదా పడుతున్న కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన శుభప్రదమైన కార్యక్రమాలు ప్రయాస మీద నెరవేరుతాయి. సాధారణమైన ఫలితాలు ఉంటాయి.

సింహం – సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ఆర్థిక స్థితిగతులలో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏర్పడవు.  ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.

కన్య – ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి గాను నూతన ప్రక్రియను అవలంబిస్తారు. బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

తుల – రుణాలు  తీరుస్తారు. సహోదర సహోదరి వర్గంతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలను సూచనలను ఎక్కువగా పాటిస్తారు.

వృశ్చికం – ఆదాయాన్ని పెంపొందించుకునే అన్ని మార్గాలను సమర్ధవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. కారణం లేని చికాకులు వేధిస్తాయి. మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మిక పట్ల మక్కువ చూపుతారు.

ధనున్సు –  అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు గాను పరిష్కార మార్గాలు వెతుకుతారు. పనులలో ఆటంకాలు ఎదురయి చికాకులు పెడతాయి. ఆరోగ్యపరంగా నలతగా ఉంటుంది.

మకరం – సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతో వ్యవహరించండి. వృత్తి- ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు.

కుంభం – శ్రమ అధికంగా ఉంటుంది.ఫలితాలు అందుకు తగిన విధంగా ఉండవు. అయినప్పటికీ ఉత్సాహవంతంగా కార్యక్రమాలను సానుకూల పరుచుకోవడానికి ఓర్పును కనబరుస్తారు.

మీనం – ప్రతి విషయంలోనూ అన్ని విధాల జాగ్రత్తలు పాటించండి. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు, ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News