Sunday, December 22, 2024

పుణె కారు ఢీకొన్న కేసు: మైనర్ కస్టడీ 12వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పుణెలో ఓవర్ స్పీడ్‌తో కారు డ్రైవ్ చేసి ఇద్దరి మృతికి కారకుడయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్ బాలుని కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు బుధవారం మైనర్ రిమాండ్‌ను జూన్ 12 వరకు పొడిగించింది.

ఈ కేసులో అరెస్టయిన బాలుని తల్లిదండ్రులు, డాక్టర్ శ్రీహరి హాల్నర్, డాక్టర్ అజయ్ తవారే, అతుల్ ఘటికాంబ్లేలకు కూడా కస్టడీ 12 వరకు పొడిగించింది. పుణె పోలీస్‌లు నిందితుడైన 17 ఏళ్ల బాలుని కస్టడీ జూన్ 12 వరకు పొడిగించాలని అభ్యర్థించడంతో కోర్టు ఆమోదించింది. ప్రస్తుతం నిందితుడు అబ్జర్వేషన్ హోమ్‌లో బందీగా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News