Friday, December 20, 2024

దంచికొట్టిన వాన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారాయి. రా ష్ట్రంలో బుధవారం నాడు తేలికపాటినుంచి పలు చోట్ల భారీ వర్షం కురిసింది.గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో సాయంత్రం వాన దంచి కొట్టిం ది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. యా దాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి పరసరప్రాంతాలలో కొద్దిసేపు వడగండ్ల వాన కురిసింది. సా యంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా గ్రేటర్‌పై మే ఘాలు కమ్ముకున్నాయి. ఉరుమలు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. నాం పల్లి, బషీర్‌భాగ్, పంజాగుట్ట, మేడ్చెల్, గచ్చిబౌ లి, మియాపూర్, తదితర ప్రాంతాలు తడిసి మద్దయ్యాయి. సాయంత్రం కురిసిన వర్షంతో పలు మార్గాల్లో రోడ్లు జలమయం కావటంతో ట్రాఫిక్ స్తంబించింది. మైండ్‌స్పేస్ సర్కిల్ నుంచి బయోడైవర్శిటి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

నగరంలోని పలు చోట్ల మ్యాన్‌హోల్స్ పొంగిపోర్లాయి.దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్ ,ఉత్తర తమిళనాడు తీరం వద్ద పశ్చిమ మద్య పరిసర నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ దాని పరిసరప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మి నుండి 4.5 కిమి ఎత్తులో కేంద్రీకృతమైవుంది. తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు గంటకు 40కి.మి వేంగంతో వీచే ఈదురుగాలులతో కడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అదిలాబాద్, ములుగు , భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ వనపర్తి, నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నాంపల్లిలో 85.5మి.మి వర్షం
రాష్ట్రంలో బుధవారం నాడు అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోని నాంపల్లిలో 85.5 మి.మి వర్షం కురిసింది. బండ్లగూడలో 81.8, చార్మినార్‌లో 80.3, కూకట్‌పల్లిలో 76.3, ఖైరతాబాద్‌లో 74.5 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అంగడికిస్తాపూర్‌లో 61, పెనుబల్లిలో 53.8, కొణిజర్లలో 47, మూసాపేటలో 41, గాధారిలో 37.3, నాగపూర్‌లో 33, రఘునాధపాలెంలో 33 మి.మి చొప్పున వర్షం కురిసింది. మిగిలిన పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News