Friday, November 15, 2024

‘రేవంత్.. వెకిలి మాటలు చాలు’: ఈటల

- Advertisement -
- Advertisement -

దేశంలో ఇండియా కూటమి అధికారం చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మల్కాజ్‌గిరి ఎంపి స్థానం నుంచి విజయం సాధించిన బిజెపి నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. అటువంటి వెకిలి మాటలు ఇకనైనా ఆపాలని చురకలు వేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, నితీష్‌లు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలాంటప్పుడు వారిని మీరు కలుస్తామని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఈటల అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని రాష్ట్ర బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో ఐదేళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మోదీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారన్న ఈటల రాజేందర్ అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని ఓటర్లు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి సొంత నియోజకవర్గం, పాలమూరులో రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ మోదీ మూడోసారి ప్రధాని కావాలని బిజెపికి ఓటు వేశారన్నారు. బిజెపి అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే వెంటపడి పని చేయిస్తామన్నారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతోంది మోదీ మాత్రమేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News