అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించడంతో సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అందరికీ ధన్యవాదాలు చెప్పారు.ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు నాయుడు మామయ్యకి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ నటుడు జూనియర్ ఎన్‌టిఆర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలకృష్ణ బాబయి, ఎంపిలు గెలిచిన శ్రీ భరత్, పురందేశ్వరీ అత్తకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్‌లో స్పందించారు. థాంక్యూ వెరీ మచ్ అమ్మ అని రిప్లై ఇచ్చాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టు 1.4 మిలియన్ల మంది వీక్షించగా 42 వేల మంది లైక్ చేశారు.
ఎన్‌టిఆర్‌కు థాంక్యూ వెరీ మచ్ అమ్మ అని చెప్పిన చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -