Saturday, September 28, 2024

18 వేల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

నల్గొండ: వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.  ఇప్పటివరకు మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి మూడు రౌండ్ల ఫలితాలు వెలువడే సరికి అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 మెజార్టీ తో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మూడో రౌండ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు 96 వేలు లెక్కించారు. మూడు రౌండ్లలో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18, 878 వేల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం ఇప్పటివరకు  2 లక్షల 88 వేల ఓట్లను లెక్కించారు.  చెల్లిన ఓట్లు 2,64,216గా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

కాంగ్రెస్: 1,06,234
బిఆర్ఎస్: 87,356
బిజెపి: 34,516
అశోక్ పాలకూరి (స్వతంత్ర): 27,493

నాలుగో రౌండ్ లో 48,013 ఓట్లను లెక్కిస్తారు. నాలుగో రౌండ్ కూడా పూర్తి అయిన తర్వాత , చెల్లుబాటైన ఓట్లలో 50%+1ఓటుతో గెలుపు కోటా నిర్ధారిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటాకు అభ్యర్థులు దూరంగా ఉండడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రం 7 గంటల తరువాత ఎలిమినేషన్ పద్దతిలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కిస్తారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో విజేతను అధికారులు ప్రకటిస్తారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో విజేతను ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News