Saturday, September 28, 2024

రష్యా లోని చమురు కర్మాగారంపై ఉక్రెయిన్ దాడి

- Advertisement -
- Advertisement -

రష్యాలోని నిజ్నీ నొవ్గోరోడ్ ప్రాంతంలో చమురు ప్రాసెసింగ్ కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్‌తో దాడి చేసింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఉక్రెయిన్ సరిహద్దుకు 775 కిమీ దూరంలో ఉన్న రష్యా భూభాగంలో చోటు చేసుకొంది. ఈ దాడి క్రెమ్లిన్ యుద్ధ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికేనని అక్కడి అధికారులు పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల నుంచి మరింత సాయం పొందడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడి జరిగింది.

ఫ్రాన్స్‌లో సంస్మరణ దినోత్సవాల్లో అమెరికా అధ్యక్షుడుబైడెన్‌తో సహా ప్రపంచ దేశాల నేతలను కలుసుకోడానికి జెలెన్‌స్కీ అక్కడకు వెళ్లారు. రష్యాఉక్రెయిన్ యుద్ధంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే తాము కూడా తమ మిత్రదేశాలకు ఆయుధాలిచ్చి దాడి చేయిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించిన తరువాత జెలెన్‌స్కీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. రష్యా భూభాగంపై యుద్ధం సాగించడానికి ఉక్రెయిన్‌కు తాము ఆయుధాలు అందిస్తామని నాటో మిత్ర దేశాలు హెచ్చరించగా దానికి ప్రతిగా పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు చమురు కర్మాగారంపై దాడివల్ల ఎంత నష్టం జరిగిందో ఇంకా వివరాలు అందవలసి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News