Thursday, December 19, 2024

వాట్సప్ గ్రూప్‌లో ఫొటోలు తొలగించారని ఇద్దరు యువకుల దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

కడ్తాల ఫార్చున్ బటర్‌ఫ్లై సిటీలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యా రు. హంతకులు యువకులను కత్తులతో పొడిచి, దారుణంగా హతమార్చారు. హత్యల అనంతరం నిందితులు పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయినట్లు తెలిసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫార్చున్ బటర్‌ఫ్లై సిటీలోని ఓ విల్లాను రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం గోవిందాయిపల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు జల్కం రవి ఇటీవల అద్దెకు తీసుకుని రియల్ ఎస్టేట్ కార్యాలయా న్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 4 న సాయంత్రం జల్కం రవి తన పుట్టినరోజు వేడుకలను పలువురు బిజెపి నా యకులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. తన పు ట్టిన రోజుకు సంబంధించిన ఫోటోలను జల్కం రవి గో విందాయిపల్లి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. పెద్ద ఎత్తున పోస్టు చేయడంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే గ్రామానికి చెందిన గుండమో ని శివగౌడ్, శేషగారి శివగౌడ్‌లు వాట్సాప్ గ్రూపులో నుంచి ఫోటోలను తొలగించారన్న నెపంతో వారిద్దరిని బుధవారం సాయంత్రం బటర్ ఫ్లై సిటీలోని తన ఆఫీసు కు రవి పిలిపించుకున్నట్లు సమాచారం.

విల్లాలో అప్పటికే ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిప ల్లి గ్రామానికి చెందిన బీజేవైఎం నాయకులు నాగరాజు గౌడ్ ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత నలుగురు కలిసి మద్యం సేవిస్తూ, ఈ క్రమంలో రవి వాట్సాప్ గ్రూపుల్లోని తన ఫోటోలను ఎందుకు డీలిట్ చేశావని శివలను ప్రశ్నించగా వారి మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్ర మంలో వారిద్దరిపై జల్కం రవి, నాగరాజు గౌడ్‌లు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం ఆ తర్వాత విల్లాకు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన రవి జరిగిన ఘటన గురించి ఉదయం పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయినట్లు తెలిసింది. సంఘటనా స్థ లానికి శంషాబాద్ అడిషనల్ డిసిపి రాంకుమార్, ఏసీపీ రంగస్వామి, కడ్తాల్, ఆమనగల్లు సీఐలు చిలివేరు శివప్రసాద్, ప్రమోద్‌కుమార్, ఎసైలు వరప్రసాద్, బలరాంనాయక్‌లు సందర్శించి, వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుల కుటుంబ సభ్యు లు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. హత్యకు గురైన శేషగారి శివగౌడ్ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా, గుండమోని శివగౌడ్ హైటెక్ సిటీలోని చికెన్‌సెంటర్‌లో పని చేస్తున్నారని సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ చిలివేరు శివప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News