Monday, November 18, 2024

నేడు ఎన్‌డిఎ ఎంపిల భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వరుసగా మూడవసారి ప్రధాన మంత్రి గా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం చేస్తూ తమ నాయకుడిగా ఆయనను ఎన్నుకునేందుకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్‌డిఎ)కి చెందిన కొత్తగా ఎన్నికైన ఎంపీలందరూ శుక్రవారం(జూ న్ 7) ఇక్కడ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎన్‌డిఎ ఎంపీల నాయకుడిగా నరేంద్ర మోడీ ఎ న్నికైన అనంతరం కూటమిలో సీనియర్ నాయకులైన చంద్రబాబు, నితీష్ కుమార్ తదితరులతో క లసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోడీ కలసి త నకు మద్దతు ఇస్తున్న ఎంపీల జాబితాను సమర్పిస్తారని వర్గాలు తెలిపాయి. ఈ వారాంతంలో.. బ హుశా ఆదివారం నాడు నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వారు చెప్పారు. ఎన్‌డిఎకి 393 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. 543 మంది సభ్యుల లోక్‌సభలో మె జారిటీ మార్కు 272 కాగా అంతకన్నా అధికంగా నే ఎన్‌డిఎకి బలం ఉంది. కాగా..ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ సన్నాహాలు మొదలుపెట్టడంతో పార్టీ సీనియర్ నాయకులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు గురువారం నాడిక్కడ సమావేశమై చ ర్చలు జరిపారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో సమావేశమైన వీరు మంత్రివర్గంలో మిత్రపక్షాల వాటా, సంకీర్ణ ప్రభుత్వంలో తమ పార్టీ నుంచి ఎవరిని చేర్చుకోవాలి వంటి అంశాలను ఈ సంర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి త్వ శాఖల కేటాయింపుపై కూటమిలోని భాగస్వా మ్య పక్షాలతో బిజెపి సీనియర్ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News