- Advertisement -
ఢిల్లీ: సిబిఐ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ శుక్రవారంతో ముగియనుంది. తీహార్ జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత పాత్రపై శుక్రవారం సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ అధికారులు వాదనలు పరిగణలోకి తీసుకొని జూలై 3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడి అధికారులు కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను సిబిఐ అరెస్ట్ చేసిన విషయం విధితమే.
- Advertisement -