- Advertisement -
హైదరాబాద్: భాగ్యనగరంలోని రామంతాపూర్ లోని గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ ఆస్పత్రిలో పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో ఇద్దరు మెడికల్ విద్యార్థినిలు తీవ్రంగా గాయపడ్డారు. రామంతాపూర్ లోని డి.కే గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డ్ లోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిలపై పడ్డాయి. ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -