ఢిల్లీ: ఎన్‌డిఎను అధికారంలోకి తీసుకరావడానికి పిఎం మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోడీ కష్టపడ్డారని, ఆంధ్రప్రదేశ్‌లోనూ మూడు బహిరంగ సభలు, ర్యాలీలో మోడీ పాల్గొన్నారని పేర్కొన్నారు. పాత పార్లమెంటు భవనంలో శుక్రవారం ఉదయం ఎన్‌డిఎ ఎంపిల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి ఎంపిలు, మిత్రపక్షాల ఎంపిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. విజనరీ నాయకుడు మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందు వరసలో ఉంటుందని, దూరదృష్టి కలిగిన మోడీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసించారు. మోడీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని బాబు కొనియాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చిందని, మోడీ నాయకత్వంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగడంతో పాటు పేదరిక రహితంగా భారత్ మారుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో 90 శాతం స్థానాలు గెలిచామని, మేకిన్ ఇండియాతో భారత్‌ను వృద్ధిపథంలో నడిపారని, ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠను ఇనుమడింప చేశారని మెచ్చుకున్నారు. ఎన్‌డిఎ లోకసభ పక్ష నేతగా మోడీ పేరును బిజెపి నేత రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించారు.
ఆర్థిక వ్యవస్థను మోడీ పరుగులు తీయించారు: చంద్రబాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -