Sunday, November 24, 2024

ఎన్‌డిఎ కూటమి భారత్ కు ఆత్మగా నిలుస్తుంది: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం లిఖించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పార్లమెంట్ పాత భవనంలో ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిజెపి నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నడ్డా, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, జెడియు నేత నితీశ్ కుమార్, జెడిఎస్ కుమార్ కుమారా స్వామి పాల్గొన్నారు. ఎన్‌డిఎ పక్షనేతగా నరేంద్రమోడీని కూటమి నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు. ఎన్‌డిఎ పక్షనేతగా ఎన్నిక కావడం సంతోషంగాఉందన్నారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతామని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా మనకుందని, గత పదేళ్లుగా సుపరిపాలన అంటే ఏంటో చూపించామని, ఈ కూటమి నేతలందరినీ చూస్తే సుపరిపాలన గుర్తుకు వస్తుందన్నారు.

దక్షిణ భారత ప్రజల ఎన్‌డిఎను అక్కున చేర్చుకున్నారని, మరింత సంక్షేమం అందించే కూటమి మనకుందని, పేదరిక నిర్మూలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని, అన్ని వ్యవస్థల్లో సాంకేతికత ప్రథమ స్థానంలో ఉందని మోడీ ప్రశంసించారు. మన కూటమి అసలైన భారత్ స్ఫూర్తిని చాటుతుందని, మన కూటమి భారత్ కు ఆత్మగా నిలుస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరం అవుతుందని, దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం అవసరం అవుతుందని, 30 ఏళ్లుగా ఎన్‌డిఎ కూటమి ఉండటం సామాన్యమైన విషయం కాదని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. మనది అత్యంత విజయవంతమైన కూటమి అని, గత 30 ఏళ్లలో ఈ కూటమి దేశాన్ని మూడు సార్లు ఐదేళ్లు పాలించిందని, మరోసారి మరో ఐదేళ్ల పాలనకు ప్రజలు అవకాశమిచ్చారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News