- Advertisement -
ముంబై: చండీగఢ్ విమానాశ్రయంలో సినీ నటి, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ ను సిఐఎస్ఎప్ సెక్యూరిటీ మహిళ చెంపపగుల గొట్టింది. కంగనా రనౌత్ రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన పంజాబ్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఆ మహిళా సెక్యూరిటీ సిబ్బంది చేయిచేసుకుంది. అయితే సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ అయిన కుల్వీందర్ కౌర్ ను పై అధికారులు నిర్బంధించి, సస్పెండ్ కూడా చేశారు.
అయితే ఇప్పుడు మ్యూజిక్ కంపోజర్, గాయకుడు విశాల్ దద్లాలానీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పెట్టాడు. ’’నేను హింసకు మద్దతు తెలుపను. కానీ ఆ సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకోగలను. ఆమెపై పైఅధికారులు చర్యలు చేపడితే, ముఖ్యంగా సిఐఎస్ఎఫ్ చేపడితే, నేను ఆమెకు ఉద్యోగం ఇస్తాను. అయితే దానికి ఆమె అంగీకరిస్తేనే. జై హింద్, జై జవాన్, జై కిసాన్’’ అని రాశారు.
- Advertisement -