Tuesday, January 21, 2025

ఎలాంటి తప్పు చేయలేదు: నటి సమంత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ మామూలు స్థాయి నుంచి అగ్ర నటి స్థాయికి ఎదిగిన చరిత్ర సమంతది.  అందం, అభినయంలో ఆమెకు ఆమెసాటి. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసి మెప్పు పొందింది. కొన్నాళ్లు స్నేహం చేసి అక్కినేని నాగార్జునను పెళ్లి చేసుకుంది.

అయితే వారిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ కారణం ఏమిటో ఇప్పటికీ తెలియక వారి అభిమానులు గందరగోళంలో ఉన్నారు. వారి విడాకుల గురించి సోషల్ మీడియాలో చాలానే వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంది. మయోసైటిస్ అనే అరుదైన జబ్బును ఎదుర్కొంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత కొన్ని విషయాలు బయటపెట్టింది. ‘పుష్ఫ’ సినిమాలో  ‘ఊ అంటావా మావ…’  ఐటెం సాంగ్ చేయడానికి తన కుటుంబ సభ్యులు ఒప్పకోలేదని, విమర్శలు వస్తాయని భయపెట్టారని చెప్పింది. ఐటెం సాంగ్ ఎందుకు చేయకూడదు..తప్పేంటి…నా వైవాహిక జీవితంలో కూడా నేను నిజాయితీగానే ఉన్నాను…ఐటెం సాంగ్ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి?… అందుకే ఓకే చెప్పాను’’ అని వివరించింది. ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News