Saturday, December 21, 2024

మన సోనాకు మహా డిమాండ్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ మార్కెట్‌లో మన వాటా 45శాతం
100 దేశాలకు బియ్యం ఎగుమతి లక్ష్యం
మిల్లర్లు బెటర్ టెక్నాలజీని పాటించాలి
ప్రపంచ వరి సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
దేశానికే తెలంగాణ ధాన్యాగారం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మన సోనా బియ్యం ఉత్పత్తులకు అంతర్జాతీయం గా భారీ డిమాండ్ ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులుకు సంబంధించి స్నేహపూర్వక విధానాలు అ మలు చేసి పోత్సాహం అందించాలని కోరారు. కొత్తరాష్ట్రంగా ఏర్పడ్డ తెంగాణ ఇటీవలే దశాబ్ది ఉ త్సవాలను జరుపుకుందని, రైస్ సమ్మి ట్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉంద ని దీనికి ప్రభుత్వం చేయూతనిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ తా జ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన గ్లోబల్ రైస్ సమ్మిట్-2024లో మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని మా ట్లాడారు. అంతకుముంమదు గ్లోబల్ రైస్ సమ్మిట్-2024ను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో క్రమంగా ధాన్యం ఉత్పత్తి పెరుగుతోందని, 1.2 కోట్ల ఎకరాల్లో సాగు అవుతున్నదని మంత్రి తుమ్మల తెలిపారు. గతేడాది 26మిలియన్ టన్నుల ధాన్యాన్ని పండిచినట్లు చెప్పారు. ప్రపంచ బియ్యం భాండాగారంగా దేశం అవతరించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 220 రకాల ధాన్యం ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిందన్నారు. ధాన్యం ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇస్తోందన్నారు.

వరికి లోకల్, గ్లోబల్ మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉందన్నారు.మిల్లర్లు ధాన్యాన్ని బియ్యంగా మార్చటంతో బెటర్ మిల్లింగ్ టెక్నాలజిని అలవరుచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వరిసాగును ప్రోత్సహిస్తూ రైతులకు క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించిందని వెల్లడించారు.. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. ధాన్యం ఎగుమతుల్లో భారత్‌కు 45 శాతం మార్కెట్ షేర్ ఉందని వెల్లడించారు. వందకు పైగా దేశాలకు భారత్ నుంచి ధాన్యం ఎగుమతి లక్షంగా పెట్టుకున్నట్టు తెలిపారు.ఈ సదస్సు ఎగుమతులకు విస్తృతమైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రపంచస్థాయిలోని కీలకమైన వర్తకులతో స్థానిక వ్యాపారులు కలిసిపని చేసే వేదికగా ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

వ్యవసాయానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్నాం: ఉత్తమ్
రాష్ట్రంలో రైతు అనుకూల కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తమ సర్కార్ వ్యవసాయానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని చెప్పారు. అన్నదాతలు పండించిన ధాన్యాన్ని సర్కార్ కనీస మద్దతు ధరకు సేకరిస్తోందని పేర్కొన్నారు. వివిధ పథకాల కింద పౌష్టికాహారం పొర్టిఫికేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామని వివరించా ఇక్కడ మూడు వేలకుపైగా అత్యాధునిక రైస్ మిల్లులు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల వనరులు పెరుగుతున్నాయని వెల్లడించారు. తెలంగాణ వరి ఉత్పత్తి థాయ్‌లాండ్‌తో సమానమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.తమ ప్రభుత్వం పూర్తి రైతు అనుకూల ప్ర భుత్వం అని ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంపై దృష్టిసారించడంతో పాటు వారికి అన్నివిధాలుగా మద్దతు అందిస్తున్నామన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నా రు. దేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు.

సాగు సదుపాయాలు పెంచడంతో పాటు ఉత్పత్తిని పెంచే కొత్త రకాల వినియోగంతో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచామని వెల్లడించారు. తమ సర్కార్ ఈ రంగంలో ఎలాంటి సహకారం, భాగస్వా మ్యం అం దించేందుకైనా పూర్తి సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా క్టర్ జి.చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రా వు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఉద్యానశాఖ డైరెక్టర్ అశోక్ రెడ్డి , ఇంటర్నేషనల్ కమోడిటీ ఇనిస్టిట్యూట్ అధ్యక్షుడు జెరేమై జ్వింజర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ సహా 25 దేశాల ప్రతినిధులు, ఐసీఏఆర్ అనుబంధ ఐఐఆర్‌ఆర్ శాస్త్రవేత్తలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు, రైతులు మొత్తం 250 మందిపైగా ఈ సదస్సుకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News