Tuesday, December 24, 2024

దులీప్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

ముంబై : భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) శుక్రవారం దులీప్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సీజన్ ఎర్ర బంతితో నిర్వహించనున్నారు. అనంతపూర్ వేదికగా సెప్టెంబర్ 57 తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నమెంట్‌లో పురుషుల సినీయర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన నాలుగు జట్లు పాల్గొంటాయి. అనంతరం వరుసగా ఇరానీ కప్, రంజీ ట్రోఫీలు నిర్వహించనున్నారు. అయితే.. ఈసారి రెండు విడతలుగా రంజీ పోటీలు జరిపేందుకు బీసీసీఐ నిర్ణయించింది. రెడ్ బాల్ క్రికెట్ టోర్నీలు పూర్తవ్వగానే వైట్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. తొలుత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. ఆ వెంటనే విజయ్ హజారే ట్రోఫీ ఉంటుంది. ఈ రెండు టోర్నీలు ముగిశాక రంజీ ట్రోఫీ రెండో విడత మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

టాస్ లేకుండానే..
మ్యాచ్‌లోనైనా టాస్ తప్పనిసరి. కానీ, ఈసారి సీకే నాయుడు ట్రోఫీ సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ టోర్నీలో ఇకపై టాస్ వేయకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తారు. టాస్ బదులు పర్యాటక జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ ఎంచుకొనే అవకాశమిస్తారు. దాంతో, ఈసారి సీకే నాయుడు ట్రోఫీ ఈ సరికొత్త నిబంధనకు తెరలేపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News