Sunday, November 24, 2024

బిసిల వాటా బిసిలకు దక్కే వరకు పోరాటం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
మన తెలంగాణ/హైదరాబాద్ : బిసిల ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాల కోసం బిసి కవులు, రచయితలు, విద్యావంతులు ఏకమై నిలిచి సంఘటిత ఉద్యమాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. మహాత్మా పూలే స్ఫూర్తిగా వనపట్ల సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాస్‌ల సంపాదకత్వంలో వచ్చిన వివిధకవుల బృహత్తర కవితా సంకలనం ధిక్కారను తెలంగాణ సాహిత్య అకాడెమీ మాజీ ఛైర్మన్ ’జూలూరు గౌరీశంకర్ హైదరాబాద్‌లోని రవీంద్రభారతి మినీ హాల్లో శనివారం ఉదయం ఆవిష్కరిం చారు. తెలంగాణ ప్రభుత్వం, భాషాసాంస్కృతిక వేదిక , నెలపొడుపుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్య్ర కమం జరిగింది.

ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ నెహ్రూ నుంచి నేటి మోడీ కేంద్ర పాలకుల వరకు చట్టసభల్లో బిసి రిజర్వేషన్ల కోసం ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడ లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు బిసిల కోసం బిసిలే మాట్లాడాలని, బిసిల కోసం బిసిలే నిలబడాలని, ఆధిపత్యవర్గాలను ప్రశ్నించా లని పిలుపునిచ్చారు. అభ్యుదయవాదులు, విప్లవవాదులమని చెప్పేవారు బిసిల న్యాయబద్దమైన సామాజిక ఉద్య మాలకు వెన్నుదన్నుగా నిలబడ తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారంలో బిసిలదే ముఖ్యపాత్ర అన్నది మరిచి పోరాదని, సకలజనుల సమ్మె అంతా బిసి లదే అని జూలూరు అన్నారు. గోరేటి వెంకన్న మాట్లాడుతూ దేశంలో బహుజన చైతన్యం అవసరముందన్నారు. కులగణన చేయాల్సిన అవస రాన్ని ఆయన నొక్కిచెప్పారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, చదువు వల్ల జ్ఞానం వస్తుందని ఈ దేశంలో చెప్పిన మొట్ట మొదటివారు మహాత్మా పూలే అన్నారు.

దామాషా ప్రకారం బహుజనులకు అధికారం దక్కేవరకు పోరాటం చేయాల్సిన అవసర ముందన్నారు. పూలేకు భారతరత్న ఇవ్వాలని ఆయన కోరారు. మానవ హక్కుల కార్యకర్త బాలరాజు, కవయిత్రి సిహెచ్ ఉషారాణి మాట్లాడుతూ పూలే స్థాపించిన సత్యశోధక సమాజ్ సంస్కరణలకు పునాది వేసిందన్నారు. డా. పసునూరి రవీందర్ మాట్లా డుతూ ధిక్కార కవిత్వంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగాలన్నారు. వెలిదండి శ్రీధర్ మాట్లాడుతూ ధిక్కార కవితా సంకలనం సాహితీలోకంలోనే కాదు సమాజంలో కూడా చైతన్యం తెస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News