Monday, November 25, 2024

టిడిపి అధినేత చంద్రబాబుతో తెలంగాణ బిజెపి ఎంపిల భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  టిడిపి అధినేత చంద్రబాబుతో తెలంగాణ బిజెపి ఎంపిలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నుంచి ఎంపిలుగా ఎన్నికైన మెదక్ అభ్యర్ధి రఘునందర్ రావు, ఆదిలాబాద్ అభ్యర్ధి గోడం నగేష్‌లు చంద్రబాబును ఢిల్లీలో కలిసి, ఆయనతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గోడం నగేష్‌ను హత్తుకొని చమత్కరించారు. గోడం నగేష్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించా రని, ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక నాయకులను కాదని నగేష్‌కు సీటు ఇచ్చానని, అయినా గెలిచి ఆ సమయంలో రికార్డు సృష్టించాడని చంద్రబాబు కొనియాడారు.

కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 అసెంబ్లీ ఎన్నికల్లో గోడం నగేష్ బోథ్ నియోజవర్గం టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పని చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టిడిపిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పలు పదవులు అనుభవించారు. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి బిఆర్‌ఎస్ పార్టీలో చేరి 2014లో ఆదిలాబాద్ ఎంపిగా గెలిచాడు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బిజెపిలో చేరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి మరోసారి ఎంపిగా ఎన్నికయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News