Friday, December 20, 2024

తీన్మార్ మల్లన్న విజయం ప్రజాస్వామ్య శక్తుల విజయం

- Advertisement -
- Advertisement -

బిసి హక్కుల సాధన సమితి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్ట భద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యులుగా తీన్మార్ మల్లన్న ( చింతపండు నవీన్) ఎన్నిక కావడం పట్ల బిసి హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల విజయానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, బిసి, ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు మల్లన్న విజయానికి తీవ్రంగా కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. విజయానికి అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ఎంతో చైతన్యంతో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన వారందరిని అభినందించారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, బిసిలకు రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, విద్య, వైద్యం తదితర సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకగా ఉండి సాధించే దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ఎంతో నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజల ప్రయోజనాలే పరమావధిగా మల్లన్న కృషి చేయాలని వెంకట్రాములు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News