Friday, December 20, 2024

జోరుమీదున్న భారత్ … నేడు పాకిస్థాన్ తో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : టి20 ప్రపంచకప్‌లో దాయాదులు భారత్, పాక్ పోరు కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకుమ సమయం రానేవచ్చింది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలుపొంది ఆత్మవిశ్వాసంతో భారత్ బరిలోకి దిగుతుండగా.. మొదటి మ్యాచ్‌ను ఓటమితో ప్రారంభించిన పాకిస్థాన్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. పసికూన అమెరికా చేతిలో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్థాన్.. మెగా టోర్నీలో కొనసాగాలంటే ఈ బిగ్ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. దీంతో ఇరు జట్లు మధ్య పోరు హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫెవరేట్‌గా టీమిండియా

ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి టేబుల్ టాపర్‌గా నిలవాలనే యోచనలో ఉంది. తొలి మ్యాచ్ లో విఫలమైన కోహ్లీ ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝలిపించాలనే కసితో ఉన్నాడు. పాకిస్థాన్‌పై పరగులు యంత్రంలా మారే కోహ్లీ ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించిన రో హిత్ శర్మ అదే జోరును కొనసాగిస్తే భారత్ గెలు పు సునయాసమే. పించ్ హిట్టర్లయిన సూర్యా, రిషభ్ పంత్, శివం ధూబె, రవింద్ర జడేజా, యశస్వి జైశ్వాల్, సంజుసామ్‌సన్ బ్యాట్‌తో రాణిస్తే భారత్ భారీ స్కోరు ఖాయం.

ఆరంభ మ్యాచ్‌లో రెచ్చిపోయిన పాండ్య అటు బ్యాట్, ఇటు బౌలింగ్ రాణిస్తుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమనే చెప్పొచ్చు. ఇక భారత బౌలింగ్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. బుమ్రా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ పేస్ ప్రత్యర్థులను భయపెట్టిస్తుండగా.. స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, యాజువేంద్ర చాహల్ బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేస్తుండటం సయితం హర్షణియమమే. ఇక భారత్ బ్యాటింగ్ బౌలింగ్‌లలో సమష్టిగా రాణిస్తే భారత్ ఖాతాలో మరో గెలుపు చేరడం ఖాయమనే చెప్పొచ్చు.

Ind vs Pak in T 20 world cup

పాక్‌కు కీలకం

ఇక ఆమెరికాతో ఓడిన పాక్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధిస్తోంది. ఓడితే మాత్రం అమెరికా ఆడే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా పాకిస్థాన్ సన్నదమవుతోంది. ఈ క్రమంలోనే తుది జట్టులో మార్పులు చేసేందుకు రెడీ అయ్యింది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేయాలనుకుంటోంది. అమెరికాతో తొలి పోరులో బాబర్ ఆజామ్, రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈ ఇద్దరూ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడే ఓపెనర్‌ను బరిలోకి దించాలని పాకిస్థాన్ భావిస్తోంది.

సయిమ్ ఆయుబ్ ఫిట్‌గా ఉంటే అతన్ని ఓపెనర్‌గా ఆడించాలనుకుంటోంది. ఆయుబ్ జట్టులోకి వస్తే ఆజామ్ ఖాన్‌పై వేటు పడనుంది. అప్పుడు మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ చేస్తాడు. అమెరికాతో మ్యాచ్‌లో ఆజామ్ ఖాన్ గోల్డెన్ డక్ అయ్యాడు. అతని వైఫల్యం పాకిస్థాన్ పరాజయానికి కారణమైంది. ఈ క్రమంలోనే ఆజామ్ ఖాన్‌ను పక్కనపెట్టాలని పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరో వెటరన్ ప్లేయర్ ఇఫ్తికర్ అహ్మద్ కూడా తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతనికి స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటం కలిసొచ్చే అంశం. న్యూయార్క్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. గాయంతో ఇబ్బంది పడుతున్న ఇమాద్ వసీం అందుబాటులోకి వస్తే అతను తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు పాకిస్థాన్ ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇమాద్ వసీం బరిలోకి దిగితే తొలి మ్యాచ్‌లో విఫలమైన హ్యారీస్ రౌఫ్‌పై వేటు పడనుంది.

ఏడింటిలో ఐదు భారతే..

ఇకపోతే ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు ఎనిమిది టి20 ప్రపంచ కప్‌లలో భాగంగా మొత్తం 7 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఐదు మ్యాచ్ లలో విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. 2007 జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్‌లు రెండుసార్లు తలపడింది. మొదటి మ్యాచ్ టై అవ్వగా.. బౌల్ అవుట్ ద్వారా భారత్ మ్యాచ్‌ను గెలిచింది. ఆ తర్వాత ఫైనల్స్‌లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి మొదటి టి20 ఛాంపియన్‌గా అవతరించింది.

2012 ప్రపంచలో సూపర్ 8 స్టేజ్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. 2014 వరల్డ్ కప్‌లో సూపర్ 8లో మరోసారి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. అనంతరం జరిగిన 2016 ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో ఇరుజట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2021లో మొదటిసారి పాకిస్థాన్ ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2022 ప్రపంచకప్‌లో ఇరుజట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో.. చివరి బాల్‌కి సిక్స్ కొట్టి భారత్‌కు గెలుపుటంచులకు చేర్చాడు.

జట్ల అంచనా
భారత్ : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూసామ్‌సన్, హార్ధిక్ పాండ్య, యశస్వి జైశ్వాల్, రవింద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, యాజువేంద్ర చాహల్, శివం ధూబె, సూర్యాకుమార్ యాదవ్.

పాకిస్థాన్ : మహమ్మద్ రిజ్వాన్, సయిమ్ ఆయుబ్, బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, ఉస్మాన్ ఖవాజా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహమ్మద్ అమీర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News