Saturday, October 5, 2024

సన్న బియ్యానికి ఎగుమతి విధానం

- Advertisement -
- Advertisement -

బాస్మతితోపాటే సాధారణ రకాలకు
రూపొందించాలి రైతు సంక్షేమమే
ప్రభుత్వ లక్షం కావాలి కేంద్రాన్ని
డిమాండ్ చేసిన వరి సదస్సు

మనతెలంగాణ/హైదరాబాద్ :వ్యవసాయోత్పత్తులకు సంబంధించి ఎగుమతుల విధానంలో మార్పులు తేవాలని ,బాస్మతి రకాల తో సమానంగా సన్నరకాల బియ్యానికి కూ డా ఎగుమతుల విధానంలో ప్రాధాన్యత క ల్పించాలని ప్రపంచ శిఖరాగ్ర వరిసదస్సు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దేశంలో తెలగాణలోని హైదరాబాద్ వేదికగా తొలిసారి నిర్వహించిన వరిసదస్సు రెండు రోజ లు పాటు చర్చాగోష్టిల అనంత రం పలు డిమాం డ్లు తెరపైకి తెచ్చింది. ఆ రుగాలం శ్రమకోడ్చి పంటలు పండిస్తున్న రై తుల సంక్షేమమే ప్రభుత్వ లక్షం కావాలని సూచించింది. ఉత్పత్తి దారుడికి కొనగోలు దారుడికి , రవాణ దారుడికి , ఎగుమతి దా రుడికి అంతిమంగా వినియోగదారుడికి ఉన్న ట్రేడింగ్ చైన్‌లో రైతుకు ,వినియోగదారుడికి మధ్య ఉన్న వ్యవస్థలే స్వల్పకృషితో స్వల్ప కాలంలో అత్యధిక లాభాలు పొందగలుగుతున్నాయని అంతిమంగా రైతులకు రిక్తహస్తాలే మిగులు తున్నాయని సదస్సు ఆందోళన వెలిబుచ్చింది.

మొత్తం వ్యవస్థలో రైతులదే కీలక పాత్ర అని వారికే అధిక లా భాలు దక్కాలని సూచించింది. కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏవున్నా రైతు సంక్షమమే లక్షంగా పనిచేయాలని సూచించిం ది. కేంద్ర ప్రభుత్వ అశాస్త్రీయ అసంబద్దమై న విధానాలే దేశంలో వ్యవసాయరంగం డొ క్కలెండగడుతోందని వరిసదస్సులో పా ల్గొన్న పలు రైతుసంఘాల ప్రతినిధులు విరమర్శలు వెలిబుచ్చారు. దేశీయంగా ఏటా 14 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోంది. అందులో దేశంలోని ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి పండిస్తున్న బాస్మతి బియ్యం ,వాటి ఎగుమతులకు ఇచ్చినంత ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వం బాస్మతేతర రకాల బియ్యం ఎగుమతులకు ఇవ్వటం లేదు. దేశంలో పండించిన ఇతర రకాల బియ్యం దేశీయంగా అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతోంది. అధికశాతం రాష్ట్రాల్లో బాస్మతేతర , సాధారణ ,సన్నబియ్యం వివిరిగా పండిస్తున్నారు. వీటికి సరైన మార్కెట్‌లేక గోదాముల్లో మగ్గిపోతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత కింద ఎఫ్‌సిఐ ద్వారా పేదవర్గాలకు సబ్సిడీ ధరలపైన బియ్యం పంపిణీకి ఇస్తున్న ప్రాధాన్యం వాటిని పండించిన రైతులకు ఇవ్వటం లేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏదో ఒక పధకం పేరుతో లక్షల కొలది టన్నుల బియ్యాన్ని ఉచితంగానే పంపిణీ చేస్తోంది. దీంతో దేశీయ మార్కెట్‌లో బియ్యానికి డిమాండ్ లేక సరైన ధరలు లభించక రైతులు ఏటా వేలకోట్ల రూపాయలు నష్టపోవాల్సివస్తోంది. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాలని వరిసదస్సుల్లో పాల్గొన్న అత్యధికసంఖ్యాలకు అభిప్రాయపడ్డారు.

సరళీకృత విధానాలే రైతుకు శరణ్యం

వ్యవసాయరంగంలో దేశీయంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి విధానాలను సరళీకృతం చేయటమే రైతుకు శరణ్యం అని రైతుసంఘాల ప్రతినిధులు చేస్తున్న డిమాండ్లకు ట్రేడర్లు కూడా శృతి కలుపు తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎగుమతి విధానం రైతుకు అనుకూలమైన రీతిలో రూపొంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి బియ్యం ఎగుమతులపై పాక్షిక నిషేధం , సంపూర్ణ నిషే ధం విధిస్తుండటంతో అంతర్జాతీయంగా బియ్యం మార్కెట్‌ను కోల్పోవాల్సివస్తోంది. మన బియ్యం కోసం ఎదురు చూసే వివిధ దేశాలు నిరాశచెంది ఇతర దేశాలవైపు చూస్తున్నాయి.

పోగొట్టుకునే అంతర్జాతీయ మార్కెట్‌ను తిరిగి పొందాలంటే ఎంతో వ్యవ ప్రయాసలు పడాల్సివస్తోంది. కొన్ని సార్లు ఇతర దేశాలతో పోటి పడి కోల్పోయిన అంతర్జాతీయ మార్కెన్‌ను తిరిగి దక్కించుకునేందుకు ధరలను దిగజార్చు దిగజార్చుకోవాల్సి వస్తోంది. అంతే కాకుండా బియ్యం ఎగుమతి సుంకం కూడా మరే దేశంలో లేని విధంగా మనదేశంలోనే 20శాతం ఉంది. ఇది కూడా అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతి దారులను నిరుత్సాహపరుస్తోంది. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం స్థిరమైన ఎగుమతి విధానాలు రూపొందిస్తే తప్ప దేశీయంగా రైతులు బాగపడలేరని రైతుసంఘాల ప్రతినిధులు , ట్రేడర్లు , ఎగుమతి దారులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News