Sunday, September 8, 2024

గట్టిగా దగ్గాడు… పేలిపోయిన పేగులు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ఓ వ్యక్తి గట్టిగా దగ్గడంతో ఆయన పేగులు పేలిపోయిన సంఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం…. అమెరికాకు చెందిన 63 ఏళ్ల వృద్ధుడు బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా గట్టిగా దగ్గాడు. దీంతో పేగులు బయటకు వచ్చాయి. తీవ్రమైన నొప్పి బాధపడుతుండడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఐఎస్‌యూలో అతడిని చేర్పించి చికిత్స అందించారు. ఆపరేషన్ చేసిన తరువాత అతడు కోలుకున్నట్టు సమాచారం. మెడికల్ లాంగ్వేజ్‌లో దీనిని డిస్ ఎంబౌల్మెంట్ అంటారని వైద్యులు తెలిపారు. అబ్ డామినల్, పెల్విక్ ఆపరేషన్లు జరిగిన తరువాత గాయం మానకపోతే ఇలాంటివి జరుగుతాయని వైద్యులు వెల్లడించారు. వంది మందిలో ముగ్గురి ఇలా జరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. దీర్ఘకాలికంగా వేదిస్తే మాత్రం చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు పేర్కొన్నారు. ఆపరేషన్లు జరిగిన దగ్గులు, తుమ్ములు, వెక్కిళ్లు ఎక్కువగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News